కార్పొరేట్ మోసాల దర్యాప్తునకు పీడబ్ల్యూసీ కేంద్రం | Corporate fraud investigations pwc center in Hyderabad | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ మోసాల దర్యాప్తునకు పీడబ్ల్యూసీ కేంద్రం

Jan 13 2016 12:29 AM | Updated on Sep 4 2018 5:07 PM

కార్పొరేట్ మోసాల దర్యాప్తునకు పీడబ్ల్యూసీ కేంద్రం - Sakshi

కార్పొరేట్ మోసాల దర్యాప్తునకు పీడబ్ల్యూసీ కేంద్రం

కన్సల్టెన్సీ రంగంలో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా.. కార్పొరేట్ మోసాల దర్యాప్తు కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్సల్టెన్సీ రంగంలో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా.. కార్పొరేట్ మోసాల దర్యాప్తు కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ రూ.10 కోట్ల దాకా వ్యయం చేసింది. ఈ కేంద్రం ద్వారా క్లయింట్ల కంపెనీల్లో యాంటీ మనీ లాండరింగ్ నియమాల అమలు, వ్యాపార ఒప్పందాలకు ముందు థర్డ్ పార్టీ దర్యాప్తు, ఈ-మెయిళ్లు, పత్రాల పరిశీలన, పరిశోధన సేవలను అందిస్తుంది. 100 మందికిపైగా సుశిక్షితులైన సిబ్బంది ఈ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఏడాదిలో మరో 150 మందిని నియమించుకోనున్నట్టు పీడబ్ల్యూసీ ఫోరెన్సిక్ సర్వీసెస్ లీడర్ దినేష్ ఆనంద్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పటికే గుర్గావ్, ముంబైలో ఫోరెన్సిక్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement