సిటీ యూనియన్‌ బ్యాంక్‌  లాభం రూ.152 కోట్లు | City Union Bank has a net profit of Rs 152 crore | Sakshi
Sakshi News home page

సిటీ యూనియన్‌ బ్యాంక్‌  లాభం రూ.152 కోట్లు

May 25 2018 1:28 AM | Updated on May 25 2018 1:28 AM

City Union Bank has a net profit of Rs 152 crore - Sakshi

న్యూఢిల్లీ: సిటీ యూనియన్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.152 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం రూ.129 కోట్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.926 కోట్ల నుంచి రూ.990 కోట్లకు పెరిగింది.  ఒక్కో ఈక్విటీ షేర్‌కు 30 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని బ్యాంక్‌ తెలిపింది. ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నట్లు కూడా (1:10) సంస్థ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement