
హాంకాంగ్: హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో చైనా ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అలీబాబా షేర్లు శుభారంభం చేశాయి. అలీబాబా షేర్ అంచనాల కంటే తక్కువగానే 176 హాంకాంగ్ డాలర్ల వద్ద లిస్టయినప్పటికీ, ఆ తర్వాత 8 శాతం లాభంతో 189.50 హాంకాంగ్ డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6 శాతం లాభంతో 187.50 హెచ్‌కే డాలర్ల వద్ద ముగిసింది. అలీబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ కావడం ఒక మైలురాయని కంపెనీ సీఈఓ డేనియల్ జాంగ్ వ్యాఖ్యానించారు.
పదేళ్లలో అది పెద్ద ఐపీఓ...
ఐపీఓలో భాగంగా అలీబాబా కంపెనీ 50 కోట్ల షేర్లను ఆఫర్ చేసి 8,800 కోట్ల హాంకాంగ్ డాలర్లు (1,100 కోట్ల డాలర్లు–రూ.77,000 కోట్లు) సమీకరించింది. హాంకాంగ్‌లో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ. హాంకాంగ్‌లో అలజడులు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో అలీబాబా షేర్ లిస్ట్ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.