ఆ విద్యార్థులకు టీసీఎస్‌ ప్రైజ్‌ మనీ, జాబ్‌ ఆఫర్‌

Amrita Vishwa Vidyapeetham Students Win TCS EngiNX 2018 - Sakshi

ముంబై : ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ నిర్వహించిన ప్రీమియర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) ఛాలెంజ్‌, ఇంజనీరింగ్‌ ఫర్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ ఆరో ఎడిషన్‌లో అమ్రిత విశ్వ విద్యాపీఠం విద్యార్థులు విజయ కెరటం ఎగరవేశారు. ముంబైలోని థానే ఒలంపిక్‌ సెంటర్‌లో జరిగిన గ్రాండ్‌ ఫినాలెలో కోయంబత్తూర్‌కు చెందిన అమ్రిత విశ్వ విద్యాపీఠం విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. దీని కింద విన్నర్లకు రూ.5 లక్షల ప్రైజ్‌ మనీ అందించింది టీసీఎస్‌. తొలి రన్నరప్‌గా నిలిచిన కోయంబత్తూర్‌ పీసీజీ ఐటీఈసీహెచ్‌ విద్యార్థులకు రూ.2.5 లక్షలను, రెండో రన్నరప్‌లైన నేతాజీ సుభాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, కోల్‌కత్తా విద్యార్థులకు లక్ష రూపాయలను ప్రదానం చేసింది. ఈ విద్యార్థులంతా తమ తమ ఇంజనీరింగ్‌ డిగ్రీలు అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా టీసీఎస్‌లో చేరేలా ప్రొవిజనల్‌ ఆఫర్లను కూడా అందజేసింది. ఈ ఏడాది ‘డిజిటల్‌ ట్విన్‌’ అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించారు. 

టీసీఎస్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ ప్రతి ఎడిషన్‌లోనూ కొత్త కొత్త టెక్నాలజీలను వెలికితీస్తామని, ఈ సారి డిజిటల్‌ ట్విన్‌ అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినట్టు టీసీఎస్‌ ఐఓటీ, ఇంజనీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేఘు అయ్యస్వామి తెలిపారు. ఈ ఏడాది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 1600 ఇన్‌స్టిట్యూట్ల నుంచి 75వేల మంది విద్యార్థులు ఈ పోటీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో మొత్తం 8500 టీమ్‌లు పాల్గొన్నాయి. ఎంపికైన టీమ్‌లు స్మార్ట్‌ మానుఫ్రాక్ట్ర్చరింగ్‌, స్మార్ట్‌ ఎకో సిస్టమ్స్‌, స్మార్ట్‌ మొబిలిటీ, స్మార్ట్‌ మిషన్స్‌, స్మార్ట్‌ హెల్త్‌ వంటి ఏరియాల్లో డిజిటల్‌ ట్విన్‌ ఉపయోగాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. ఈ కంటెస్ట్‌ ఎమర్జింగ్‌ ఏరియాల్లో విద్యార్థుల పోటీతత్వాన్ని, ప్రతిభను నిరూపించుకునేందుకు సహకరిస్తుందని రేఘు చెప్పారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top