బిగ్‌బాస్కెట్‌లోకి ఆలీబాబా 1,920 కోట్లు

Alibaba into Bigbasket is 1,920 crores invest - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ, బిగ్‌బాస్కెట్‌ తాజాగా 30 కోట్ల డాలర్ల (రూ.1,920 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. చైనా ఈ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా, అబ్రాజ్‌ క్యాపిటల్, శాండ్స్‌ క్యాపిటల్, ఐఎఫ్‌సీ తదితర సంస్థల నుంచి ఈ నిధులు సమీకరించామని బిగ్‌బాస్కెట్‌ సీఈఓ హరి మీనన్‌ చెప్పారు. ఈ నిధులతో రైతుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని, తమ సేవలను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,800 మంది రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, ఈ సంఖ్యను 3,000కు పెంచనున్నామని వివరించారు. మరోవైపు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షారూక్‌ ఖాన్‌ కొనసాగుతారని, ఆయనతో కాంట్రాక్టును రెన్యువల్‌ చేశా మని పేర్కొన్నారు.

ఇటీవలనే 80 లక్షల వినియోగదారుల మైలురాయిని దాటామని, హైదరాబాద్, బెంగళూరుల్లో బ్రేక్‌ ఈవెన్‌కు వచ్చామని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,410 కోట్ల ఆదాయం సాధించామని వివరించారు. గ్రోఫర్స్, అమెజాన్‌లకు గట్టిపోటీనివ్వడానికి బిగ్‌బాస్కెట్‌కు ఈ తాజా నిధులు ఉపయోగపడతాయని నిపుణులంటున్నారు. ఈ డీల్‌ ప్రాతిపదికన బిగ్‌బాస్కెట్‌ విలువ 90 కోట్ల డాలర్లని అంచనా.  జొమాటొలో ఆలీబాబా పెట్టుబడులు  కాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ యాప్‌ జొమాటొలో చైనాకు చెందిన ఆలీబాబా అనుబంధ సంస్థ, ఆంట్‌ స్మాల్‌ అండ్‌ మైక్రో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top