ఎఫ్‌డీఐ నిబంధనలపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన | Airlines raise 'security' concerns on FDI norms | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐ నిబంధనలపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన

Jan 5 2017 12:58 AM | Updated on Oct 4 2018 5:15 PM

ఎఫ్‌డీఐ నిబంధనలపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన - Sakshi

ఎఫ్‌డీఐ నిబంధనలపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన

భారత విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్‌యేతర సంస్థలకు 100% యాజ మాన్య హక్కులు ఇచ్చే నిబంధనపై వివిధ విమానయాన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్‌యేతర సంస్థలకు 100% యాజ మాన్య హక్కులు ఇచ్చే నిబంధనపై వివిధ విమానయాన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది భద్రతాపరమైన సమస్యలు సృష్టించవచ్చని విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో ఆందోళన వ్యక్తం చేశాయి.  వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్, ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఏవియేషన్‌ చాలా కీలకమైన రంగం కావడంతో ఈ విధమైన ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు వల్ల భద్రతపరమైన సమస్యలు తలెత్తవచ్చని వారు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement