వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది.
సాక్షి, గుంటూరు/గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి రైతులు, కౌలురైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల సాధకబాధకాలు తెలుసుకోనుంది. పార్టీ నేతలు జరీబు పొలాల్లో తిరిగి, పచ్చని పంట పొలాలను పరిశీలించి, రైతుల ఆందోళనకు ఆలంబనగా నిలువనున్నారు. అనంతరం రాజధాని గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుంటారు. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తారు.