సీపీఎం చేపట్టిన దీక్షకు వైఎస్ఆర్ సీపీ పార్టీ మద్ధతు తెలిపింది.
కర్నూలు(నంద్యాల): సీపీఎం చేపట్టిన దీక్షకు వైఎస్ఆర్ సీపీ పార్టీ మద్ధతు తెలిపింది. ఇందుకు సంఘీభావంగా పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈ దీక్షకు మద్ధతునిచ్చారు. నంద్యాల పట్టణ అభివృద్ధికి తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలని కోరుతూ సీపీఎం నాయకులు నంద్యాల పట్టణంలో 72 గంటల నిరసన దీక్షకు దిగారు. మూతపడిన చక్కెరఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్లు, కూల్డ్రింక్స్ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిని 500 పడకల స్ధాయికి పెంచాలని, కల్చరల్ యూనివర్సిటీని, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలను నంద్యాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ దీక్షలో నలుగురు సీపీఎం నాయకులు కూర్చున్నారు.
అనంతరం భూమానాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు పోయి తమ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ దీక్షకు కాంగ్రెస్, సీపీఐలతో పాటు పలు రాజకీయపక్షాలు మద్ధతు తెలిపాయి.