జీతోను అభినందిస్తున్నా : ఆర్కే రోజా

YSRCP Leader RK Roja Praises JITO - Sakshi

సాక్షి, విజయవాడ : మహిళల నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా చేస్తున్న జీతోను అభినందిస్తున్నానని ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం జీతో మహిళా విభాగం ఎగ్జిబిషన్‌ను ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. జీతో మహిళా విభాగం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎగ్జిబిషన్‌లో ఉన్న మహిళలను చూస్తేనే మహిళా సాధికారత ఎంత వరకు అభివృద్ధి చెందిందో తెలుస్తోందని అన్నారు. అన్ని స్టాల్స్‌లోనూ స్త్రీల నైపుణ్యంతో చేసినవే ప్రదర్శించడం చాలా నచ్చిందని అన్నారు.

ఎగ్జిబిషన్‌ ప్రారంభించటం సంతోషం : వాసిరెడ్డి పద్మ
మూడు రోజుల పాటు జరగనున్న జీతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శుక్రవారం జీతో మహిళా విభాగం ఎగ్జిబిషన్‌ ప్రారంభం సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..  చాలా యాక్టివ్‌గా ఎఫిషియంట్‌గా ఉన్న మహిళలను జీతోలో చూస్తున్నానని అన్నారు. ఇది మహిళలకు మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top