పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీలో విషాదం | YSRCP Leader Died In Punganur With Heart Stroke | Sakshi
Sakshi News home page

పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీలో విషాదం

Aug 26 2018 11:28 AM | Updated on Aug 26 2018 11:28 AM

YSRCP Leader Died In Punganur With Heart Stroke - Sakshi

ఆంజప్పకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆయన మాజీ సర్పంచ్‌. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కలిగే మేలును ప్రజలకు వివరించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

పుంగనూరు/మదనపల్లె : పుంగనూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు శనివారం గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటతడి పెట్టారు. నాయకుల భౌతికకాయాల వద్ద మౌనంగా కూర్చుని ఉండిపోయారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పుంగనూరు మండలంలో పల్లెబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వారిలో చండ్రమాకులపల్లె మాజీ సర్పంచ్‌ వేణుగోపాల్‌రెడ్డి(45) కూడా ఉన్నారు. తన ఇంటిలో ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే బయలుదేరుతుండగా వేణుగోపాల్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యా రు. వెంటనే నాయకులు ఆయనను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరిం చారు. శనివారం ఉదయం పుంగనూరు మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ షమీమ్‌ మామ, మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం అధ్యక్షుడు ఫకృద్దీన్‌ షరీఫ్‌ తండ్రి మహమ్మద్‌ షరీఫ్‌ (65) గుండెపోటుతో మృతి చెందారు. అలాగే యాదవ సంఘం నాయకుడు ఆంజప్ప (60) కూడా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాటను రద్దు చేసుకుని మదనపల్లె ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వేణుగోపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. బోరున విలపిస్తూ ఆస్పత్రిలోనే కూర్చుండిపోయారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి , తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌ సీపీ కన్వీనర్‌ ద్వారకనాథరెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ద్వారకనాథరెడ్డి కూడా బోరున విలపించారు.

మృతులకు నివాళి
మృతులు ఆంజప్ప, వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మద్‌షరీఫ్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. భౌతికదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఓకే రోజు ముగ్గురు నాయకుల మృతితో వైఎస్‌ఆర్‌ సీపీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైస్‌ఎంపీపీ రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, పెద్దిరెడ్డి, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, యువజన సంఘ నాయకులు రాజేష్, ప్రతాప్, రెడ్డెప్ప, బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్, కౌన్సిలర్‌ జింకా వెంకటాచలపతి, బాలగంగాధర రెడ్డి, జయరామి రెడ్డి, కనకదుర్గ సత్య, దండాల రవిచంద్రా రెడ్డి, భువనేశ్వరి సత్య, గార్ల చంద్రమౌళి, హరి రాయల్, డీఎల్‌పీవో లక్ష్మి, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఏఈ పురుష్తోతం, జేఈ జగదీష్, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement