మార్కెట్‌ వెండర్స్‌కు, రైతులకు మాస్క్‌ల పంపిణీ

YSR Kadapa Old Students Distributes Masks And Sanitizes At Market - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప:  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు కోరలు చాస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని వ్యాపార రంగాలు మూతపడటంతో దినసరి కూలీలు, వలస కూలీల, పేదల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారి ఆదుకునేందుకు వ్యక్తులు, ఆయా స్వచ్చంధ సంస్థలు నడుం బిగించారు. వివిధ ఫౌండేషన్‌ల ద్వారా విరాళాలు ప్రకటిస్తున్నారు. (ఏప్రిల్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ పాక్షిక ఎత్తివేత!)

విద్యార్థి సంఘాలు, పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి తమ వంతుగా సహాయంగా డబ్బులు పంచడం, అన్నదాన కార్యక్రమాలు, మాస్క్‌లు, శానిటైజర్‌లు పంచుతూ మేము సైతం అంటూ భాగస్వాములవుతున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంత పూర్వ విద్యార్థులు శనివారం స్థానిక మార్కెట్‌ వెండర్స్‌కు మాస్క్‌లు, శానిటైజర్‌లను పంపిణీ చేశారు. మార్కెట్‌లో కూరగాయలు అమ్మె రైతులు, కొనడానికి వచ్చిన ప్రజలు, మార్కెట్‌ వెండర్స్‌, సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాస్క్‌లు, శానిటైజర్‌లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top