వైఎస్ మాట తప్పేవారు కాదు: కొండా సురేఖ | ys rajasekhara reddy no change word, says konda surekha | Sakshi
Sakshi News home page

వైఎస్ మాట తప్పేవారు కాదు: కొండా సురేఖ

Aug 22 2013 2:07 AM | Updated on Jul 7 2018 2:52 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట ఇస్తే తప్పేవారు కాదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా బుధవారం ఆమె బంజారాహిల్స్ రోడ్డునెం10 చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట ఇస్తే తప్పేవారు కాదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా బుధవారం ఆమె బంజారాహిల్స్ రోడ్డునెం10 చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణపై వైఎస్సార్ సీపీ మాట తప్పడం వల్లనే ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్‌మోహన్‌రె డ్డి తండ్రి మాటకు కట్టుబడి నడుచుకోవడం లేదన్నారు. వైఎస్‌ను దూషించేవారే పార్టీలో చలామణి అవుతున్నారని, ఒకప్పుడు రాష్ట్ర నేతలుగా ఉన్న తాము ఇటీవలి పరిణామాలతో కార్యకర్తలుగా మారాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోవాలని ఆమె సూచించారు. వైఎస్ పేరిట సృ్మతివనం నిర్మించాలని సురేఖ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement