రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న ఏకైక నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.
పామర్రు, న్యూస్‌లైన్ :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న ఏకైక నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. మంగళవారం పామర్రులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో ఒక మాట, తెలంగాణాలో మరోక మాట మాట్లాడుతూ ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతికహక్కు లేదన్నారు.
సమైక్యం కోసం పోరాడుతున్న మడమ తిప్పని జననేత జగన్‌ను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కాక తాళీయంగా హిట్లర్ పుట్టిన రోజునే పుట్టిన చంద్రబాబుకు ఆయన బుద్ధులే అబ్బాయన్నారు. ఒక అబద్దాన్ని 100 సార్లు చెబితే నిజంగా మార్పు చేయడం కోసం హిట్లర్ తన పక్కన గ్లోబెల్‌ను మంత్రిగా ఉంచుకున్నాడని తెలిపారు. నాటి గ్లోబెల్ తరహాలోనే ప్రస్తుతం చంద్రబాబుకు వర్ల రామయ్య దొరికాడని చెప్పారు. కిరణ్, చంద్రబాబుల కారణంగానే రాష్ట్రం రావణ కాష్టంలా తయారయిందని విమర్శించారు.
ఎన్టీఆర్, వైఎస్‌లా జగనే సమర్థుడు....
ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మహానేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ తరహాలో రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన ఏకైకనేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని సినీనటుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీన ర్ విజయ్‌చందర్ అన్నారు. పామర్రులోని పార్టీ కార్యాలయంలోని దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి , ఈ మధ్యనే మృతి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయ్‌చందర్ మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి భావితరాలకు ఆదర్శ నాయకుడుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహనరెడ్డి నిలుస్తారన్నారు. రాష్ట్రంలో విభజన వాదాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు, కిరణ్‌లు తెలుగు జాత్రి ద్రోహులు గా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు తొత్తు వర్ల రామయ్య జననేత జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమని చెప్పారు. చిరంజీవి తన గురించి తాను కలలు కనడం తప్ప.... రాష్ట్ర సమస్యలపై ఏనా డూ స్పందించలేదని విమర్శించారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ కన్వీనర్ ఎన్.రవిబాబు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాహుల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి నాయకులు సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.