ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా? | ys jagan mohan reddy bharosa yatra | Sakshi
Sakshi News home page

ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా?

May 15 2015 12:31 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా? - Sakshi

ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా?

అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూ.3వేలు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు..

ఉరవకొండ: అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూ.3వేలు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు.. ఆ మూడు వేలు మేం కట్టుకోలేమా అని ఓ మహిళ  ఎద్దేవా చేసింది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం ఉరవకొండలో డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, రైతులతో ముఖాముఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉరవకొండకు చెందిన మల్లేశ్వరి అనే మహిళ మాట్లాడుతూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టొద్దు...నేను అధికారంలోకి వచ్చాక అన్ని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడని, అయితే ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ఏ రుణాన్ని మాఫీ చేయలేదన్నారు. తీసుకున్న రుణం కట్టకపోతే ఇళ్లకు వస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, తమ ఆస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తన గోడు వెలిబుచ్చింది. తాను రూ. యాభై వేలు రుణం తీసుకుంటే.. మూడు వేలే ఇస్తామనడం ఎంత వరకూ సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీసింది.


మరో కార్మికుడు రాజు మాట్లాడుతూ.. తమ కుటుంబం తీసుకున్న ఓ ఒక్క రుణం కూడా మాఫీ కాలేదని చెప్పాడు. తాము రుణమాఫీ ఆశించి భంగపడ్డామని, అంతేకాకుండా కష్టపడి జమ చేసుకున్న తమ అకౌంట్లో ఉన్న రూ.70 వేల రూపాయిలను  కూడా బ్యాంకు వారు జప్తు చేసుకున్నారని తెలిపాడు.  ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు రాజు ఓ నివేదికను అందజేశాడు.తమ సమస్యలపై పోరాటం చేయాలని జగన్ కు విన్నవించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement