ఎవరన్నారు వైఎస్‌ ఈ లోకంలో లేరని.. | Women Tied Rakhi To Ysr | Sakshi
Sakshi News home page

ఎవరన్నారు వైఎస్‌ ఈ లోకంలో లేరని..

Aug 27 2018 1:22 PM | Updated on Sep 2 2018 4:56 PM

Women Tied Rakhi To Ysr - Sakshi

కాశీబుగ్గ  :  అభిమానించే ప్రతి గుండెలోనూ ఇలా ఆయన ఉనికి కనిపిస్తూనే ఉంది. జన కుటుంబాన్ని వదిలి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజల మనసుల్లో మాత్రం మహానేత రూపం సజీవంగానే ఉంది. అందుకు తార్కాణమే ఈ చిత్రం. కాశీబుగ్గలోని వైఎస్‌ విగ్రహానికి ఓ మహిళ ఆదివారం ఇలా రాఖీ కడుతూ కనిపించిం ది.

స్థానికులు ఆమె వివరాలు ఆరా తీసే లోగానే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కుమారుడికి గుండె ఆపరేషన్‌ చేయిం చినందుకు కృతజ్ఞతగా ఏటా వేకువజామున వచ్చి ఇలా రాఖీ కట్టి వెళ్తుందని, వర్షం కారణంగా ఈ రోజు ఆలస్యంగా వచ్చిందని కొందరు స్థానికులు తెలిపారు. నాయకుడిగా వైఎస్‌ సంపాదించిన ప్రేమకు ఇదో మచ్చుతునక అని స్థానికులు చర్చించుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement