అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | Woman died in suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

May 25 2015 12:17 AM | Updated on Sep 3 2017 2:37 AM

మండలంలోని జాగరం రెవెన్యూ పరిధి రాజుగారి సేరిపొలంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది.

 జాగరం(జామి): మండలంలోని జాగరం రెవెన్యూ పరిధి రాజుగారి సేరిపొలంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పశువుల కాపర్లు పొలంలో ఉన్న మహిళ మృతదేహన్ని చూసి  పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమచారం అందించారు. ఆదివారం సాయంత్రం ఎస్సై ఎస్.ఎం.ప్రశాంత్‌కుమార్, తహశీల్దార్  ఆర్.ఎర్నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు.
 
 మృతిపై అనేక అనుమానాలు
 మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పక్కన చిన్న వాటర్ బాటిలు ఉంది. మృతురాలి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఘటన జరిగి ఐదారు రోజులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండి దుర్వాసన వస్తోంది. సమీపంలోని పావడ గ్రామంలో ఇటీవల గ్రామ దేవత పండగ జరిగింది. ఈ పండగకు వచ్చిన మహిళ అయి ఉంటుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎస్సై ప్రశాంతకుమార్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement