వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి | wo killed in separate accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Aug 12 2014 2:23 AM | Updated on Aug 25 2018 5:41 PM

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - Sakshi

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

తాడేపల్లిగూడెంలోని అయ్యప్ప హొటల్ సమీపంలో మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెం దగా, ఇద్దరు గాయూల పాలయ్యూరు.

 తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలోని అయ్యప్ప హొటల్ సమీపంలో మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెం దగా, ఇద్దరు గాయూల పాలయ్యూరు. పట్టణ ఎస్సై వి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఒక హొటల్‌లో పనిచేస్తున్న మామిడి అప్పల రాజు, నోముల వెంకన్న, వీరెళ్ల బాబి అనేవారు మోటార్ సైకిల్‌పై తమ స్నేహితుడైన గంగాధర్ కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళుతున్నారు. అయ్యప్ప హొటల్ సమీపానికి వచ్చేసరికి వెనుకనుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది.
 
 మోటార్ సైకిల్‌పై వెనుక కూర్చున మామిడి అప్పల రాజు (24) అక్కడికక్కడే మృతిచెందగా, మధ్యలో కూర్చున నోముల వెంకన్నకు తీవ్రగాయాలయ్యా యి. మోటార్ సైకిల్ నడుపుతున్న బాబి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అప్పలరాజుకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలరాజు మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. అప్పలరాజు కష్టపడి చెల్లెల్ని ఇంటర్మీడియెట్ చదివి స్తున్నాడని అతని బంధువులు తెలిపారు. తాలూకా ఆఫీస్‌సెంటర్ సమీపంలో ఒక హొటల్‌లో అప్పలరాజు క్లీనింగ్ సెక్షన్‌లో, నోముల వెంకన్న వెజిటేరియన్ కుక్‌గా, బాబి సర్వర్‌గా పనిచేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 అప్పనవీడులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
 పెదపాడు : ఆగివున్న లారీని మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై తాడి వెంకటనాగరాజు చెప్పారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం అప్పనవీడు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సుద్ద లోడు లారీని కలపర్రు టోల్‌గేట్ సమీపంలో హెచ్చరికలు, సిగ్నల్స్ లేకుండా ఆది వారం రాత్రి 11.30 గంటల సమయంలో నిలుపుదల చేశారు. వెనుకనుంచి వేగంగా వస్తున్న పంచదార లారీ ఆగివున్న లారీని ఢీకొట్టింది. పంచాదార లోడు లారీలో ఉన్న బీహార్‌కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కలపర్రు వీఆర్‌వో గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతుని వివరాలు తెలియూల్సి ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement