'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం' | Will not tolerate to scare Capital region farmers, says mla RK | Sakshi
Sakshi News home page

'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'

Feb 6 2015 6:02 PM | Updated on Sep 2 2017 8:54 PM

'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'

'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'

విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు.

రోజురోజుకీ రైతులను సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్డీఏ కమిషనర్కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement