ఒంటరిగా పోటీచేసే సత్తా మాకుంది: జైపాల్ రెడ్డి | we can fight alone in telangana, says jaipal reddy | Sakshi
Sakshi News home page

ఒంటరిగా పోటీచేసే సత్తా మాకుంది: జైపాల్ రెడ్డి

Mar 8 2014 3:28 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఒంటరిగా పోటీచేసే సత్తా మాకుంది: జైపాల్ రెడ్డి - Sakshi

ఒంటరిగా పోటీచేసే సత్తా మాకుంది: జైపాల్ రెడ్డి

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్ కూడా ఒంటరి పోరుపై ఆసక్తిగా ఉందని చెప్పారు.

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్ కూడా ఒంటరి పోరుపై ఆసక్తిగా ఉందని, తెలంగాణ కోసం కలిసి పోరాడిన కార్యకర్తల్లో చీలిక తేవడం మంచిది కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేయడంలో నిగ్రహం పాటిస్తున్నారని, అలాగే కేసీఆర్ కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాలని జైపాల్ సూచించారు.

అలాగే, తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ తొందరపడి ముందుగానే ప్రకటించడం మంచిది కాదని జైపాల్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుల విషయంలో తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌దేనని ఆయన తెలిపారు. పొత్తుల విషయంలో తామంతా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీని హైకమాండ్ ప్రకటిస్తుందని కూడా జైపాల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement