రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడి | Vigilance officers raids in rice mill in east godavari district | Sakshi
Sakshi News home page

రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడి

Jan 19 2016 9:46 AM | Updated on Sep 3 2017 3:55 PM

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోలని రైస్ మిల్లుపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోలని రైస్ మిల్లుపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా 26 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన బియ్యం బస్తాలు సదరు మిల్లులో ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement