టీవీ రిపేరంటూ తీసుకెళ్లి గొంతుకోశారు | unknowns attemts murder of an mechanic in tadepally gudem | Sakshi
Sakshi News home page

టీవీ రిపేరంటూ తీసుకెళ్లి గొంతుకోశారు

Sep 5 2015 11:10 PM | Updated on Jul 29 2019 5:43 PM

టీవీ బాగు చేయాలని చెప్పి మెకానిక్‌ను బైక్‌పై తీసుకెళ్లిన దుండగులు గొంతు కోసి పరారయ్యారు.

పశ్చిమగోదావరి: టీవీ బాగు చేయాలని చెప్పి మెకానిక్‌ను బైక్‌పై తీసుకెళ్లిన దుండగులు గొంతు కోసి పరారయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ చల్లా నాగ వెంకట మురళిని ఇద్దరు దుండగులు టీవీ బాగు చేయాలని చెప్పి శనివారం రాత్రి బైక్‌పై ఎక్కించుకున్నారు. తణుకు రూరల్ మండలం ముద్దాపురం గ్రామానికి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యారు.

స్థానికులు అతడ్ని తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement