వైరల్ ఫీవర్‌తో ఇద్దరి మృతి | two persons dead due to viral fever | Sakshi
Sakshi News home page

వైరల్ ఫీవర్‌తో ఇద్దరి మృతి

Oct 16 2015 2:12 PM | Updated on Nov 9 2018 5:02 PM

శ్రీకాకుళం జిల్లాలో వైరల్ ఫీవర్ ఓ విద్యార్ధితో పాటు వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో వైరల్ ఫీవర్ ఓ విద్యార్ధితో పాటు వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది. సంతకవిటి మండలంలో దుర్గారావు(15), నూకమ్మలు గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మోదుగులపేటకు చెందిన దుర్గారావు స్ధానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ప్రాణాలొదిలారు.  వైరల్ ఫీవర్తో జరుగుతున్న వరుస మరణాలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement