తుడా కార్యదర్శిగా మాధవీలత | Tuda Secretary madhavilata | Sakshi
Sakshi News home page

తుడా కార్యదర్శిగా మాధవీలత

Sep 13 2013 1:56 AM | Updated on Sep 1 2017 10:39 PM

నెల్లూరు ఆర్డీవో కె. మాధవీలత తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యదర్శిగా తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.

 సాక్షి, నెల్లూరు: నెల్లూరు ఆర్డీవో కె. మాధవీలత తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యదర్శిగా తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. మాధవీలత తనకు తానుగా బదిలీపై వస్తున్నారు. నంద్యాల ఆర్డీవోగా పని చేస్తూ 2011, జూన్‌లో నెల్లూరుకు బదిలీపై వచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మల్‌కాట్‌పల్లికి చెందిన మాధవీలత తొలుత ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత 2007లో గ్రూప్-1లో మహిళల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ప్రొబెషనరీ పీరియడ్ కింద తొలుత రంగారెడ్డి డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు.

2008 అక్టోబర్‌లో నంద్యాల ఆర్డీవోగా వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఉన్నతాధికారుల అండదండలతో మొబైల్ రెవెన్యూ సర్వీసులను ఆమె ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నేరుగా గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని తీసుకెళ్లి అక్కడికక్కడే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా మన్ననలు సైతం పొందారు. కడప జిల్లా సిద్దవటం మండలం కొత్తపల్లెకు చెందిన వెంకట్‌రామ్‌మునిరెడ్డి మాధవీలత భర్త. ఆయన నెల్లూరు ఏరువాక కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement