అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణానదిలో కృష్ణానదిలో అనధికారికంగా నడుస్తున్న ఇసుక ర్యాంపు వద్ద నదిలో తీసిన గోతుల్లో పడి ఆదివారం
కృష్ణానది ఇసుక గోతుల్లో మునిగి ముగ్గురు..
అచ్చంపేట (పెదకూరపాడు జోన్): అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణానదిలో కృష్ణానదిలో అనధికారికంగా నడుస్తున్న ఇసుక ర్యాంపు వద్ద నదిలో తీసిన గోతుల్లో పడి ఆదివారం ముగ్గురు మృతిచెందారు. గ్రామానికి చెందిన అన్నదమ్ముల కుమారులు మాత్సా మానవీంద్ర (18), మాత్సా కౌటిల్య (15), వారి అక్క కుమారుడు అజయ్ (21) కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు.
అక్కడి ఇసుక గోతిలో మునిగిపోతున్న మానవీంద్రను రక్షించేందుకు ప్రయత్నించి మిగిలిన ఇద్దరు కూడా మునిగిపోయారు. వీరు మునిగిపోవడాన్ని గమనించిన సమీపంలో ఉన్నవారు వచ్చి గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.