
పెళ్లింట విషాదం
పెళ్లి తోరణాలతో కళకళలాడిన ఆ ఇంట విషాదం నెలకొంది. కుమారుడి వివాహంతో ఆనంద పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది.
రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి
సుందరయ్య కాలనీలో విషాదఛాయలు
గాజువాక : పెళ్లి తోరణాలతో కళకళలాడిన ఆ ఇంట విషాదం నెలకొంది. కుమారుడి వివాహంతో ఆనంద పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో తల్లీ కొడుకులను మృత్యువు కబళించింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా యలమంచిలి వద్ద జరిగిన ప్రమాదంలో వీరు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కె.వెంకటరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి సుందరయ్య కాలనీలో నివాసముంటున్నా రు. ఆయనకు భార్య మాధవితోపాటు కుమా ర్తె, ఇద్దరు కుమారులున్నారు. అతనికి సొంత లారీ ఉండగా కుమారులిద్దరూ డ్రైవర్లుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు రమేష్‌కు ఈనెల 20న స్థానిక రైల్వే క్వార్టర్లలోని కల్యాణ మండపంలో వివాహం చేశారు.
కుమారునికి వచ్చిన సారె మిఠాయిలను తమ పుట్టింటికి ఇచ్చేందుకు మాధవి చిన్న కుమారుడు రామరాజుతో కలిసి బైక్‌పై అడ్డురోడ్డు దరి వేంపాడుకు మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లా రు. అక్కడ పని చూసుకొని మధ్యాహ్నం రెం డు గంటల సమయంలో తిరిగి ప్రయాణం కా గా, జాతీయ రహదారిపై పురుషోత్తపురం వ ద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లీ కొడుకులు మృతి చెందారు. దీంతో సుందరయ్య కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మాధ వి భర్తకు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు రావడంతో ప్రమాద విషయాన్ని ఆయనకు తెలియనివ్వలేదు.
రామరాజు చాలా మంచోడు...
రామరాజు చాలా మంచోడని అతని స్నేహితులు తెలిపారు. కాలనీలో ఎలాంటి ఉత్సవా లు నిర్వహించినా ముందుండేవాడని, ఇప్పు డు దూరమయ్యాడని కన్నీరు పెట్టుకున్నారు.