ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 25వ తేదీన రాయచోటికి వస్తున్నట్లు డీఆర్‌ఓ ఈశ్వరయ్య తెలిపారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 25వ తేదీన రాయచోటికి వస్తున్నట్లు డీఆర్‌ఓ ఈశ్వరయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 10.40గంటలకు చిత్తూరు జిల్లా కలికిరి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11.10గంటలకు రాయచోటి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు.
11.20గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.30గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుని ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. అక్కడ ఏర్పాటుచేసే సభలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేస్తారన్నారు. మధ్యాహ్నం 1గంటకు బహిరంగసభను ముగించుకుని 1.10గంటలకు హెలిప్యాడ్ చేరుకుని రేణిగుంటకు బయలుదేరి వెళతారన్నారు.