రూ. 1,56,990 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
సాక్షి, అమరావతి: రూ. 1,56,990 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 13న సభ జరక్కపోవడం, 14న ఆయన మృతికి సంతాప తీర్మానం, దానిపై చర్చ తర్వాత సభ వాయిదా పడిన నేపథ్యంలో 30, 31 తేదీల్లోనూ సభ జరపాలని తీర్మానించారు.
నేడు మంత్రివర్గ సమావేశం
మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడం కోసం బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది.