చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న నల్లమల అడవుల్లో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపించింది.
చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న నల్లమల అడవుల్లో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపించింది. మావోయిస్టులు- పోలీసుల ఎదురు కాల్పులతో నల్లమల అడవి మార్మోగింది. గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను విమలక్క, జానా బాబురావు, సారథిగా అనుమానుమనిస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో శతకోటిలో ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
సంఘటన స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, కార్బన్ ఆయుధాలు లభ్యం, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు మావోయిస్టు నేతలు సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి ఎన్కౌంటర్ కావడం గమనార్హం.