విషవాయువు పీల్చి ముగ్గురు కూలీల మృతి | Three laborers killed with Toxic gas | Sakshi
Sakshi News home page

విషవాయువు పీల్చి ముగ్గురు కూలీల మృతి

Apr 18 2017 1:38 AM | Updated on Sep 18 2018 7:34 PM

వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రంలో విషవాయువు

చాపాడు: వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రంలో విషవాయువు ప్రభావంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు.  బయోగ్యాస్‌ ఉత్పత్తికి అవసరమైన మరిగించిన వ్యర్థ పదార్థాలు పైపుల్లో నుంచి తొలగించేందుకు 12 అడుగుల లోతులో ఉన్న సంపులోనికి సోమవారం ముగ్గురు కూలీలు నిచ్చెన ఆధారంగా దిగారు.కొద్ది సేపటికే వారు కేకలు పెట్టడంతో ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

వారు వచ్చి ముగ్గురు వ్యక్తులను బయటికి తీశారు. అప్పటికే చాపాడు మండలం వీవీ కొట్టాలకు చెందిన వడ్డెమాను జగదీశ్‌చంద్ర ప్రసాద్‌రెడ్డి(29), మైదుకూరు సంత కాలనీకి చెందిన గొర్రె రాముడు(38) మృతి చెందారు. కొనఊపిరితో ఉన్న సిద్దారెడ్డిపల్లెకు చెందిన అల్లాడుపల్లె ఆంజనేయులు(40)ను కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement