జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు, బలహీన వర్గాల పక్కా ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకలో సర్పంచ్ చికిలే డేవిడ్ రాజు అధ్యక్షతన
పి.గన్నవరం :జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు, బలహీన వర్గాల పక్కా ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకలో సర్పంచ్ చికిలే డేవిడ్ రాజు అధ్యక్షతన బుధవారం జరిగిన జన్మభూమి సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇసుక మాఫియాను అరికట్టి, ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రజల ఫిర్యాదు మేరకు కలెక్టర్ పైవిధంగా స్పందించారు. మరో పది రోజుల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుకరీచ్‌లు ప్రారంభమవుతాయని, మూడు మెట్రిక్ టన్నుల ఇసుక ధరను రూ. రెండువేలుగా నిర్ణయించామన్నారు. నాగుల్లంకలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాననన్నారు. స్థలం కేటాయిస్తే మినరల్ వాటర్‌ప్లాంటు మంజూరు చేస్తానన్నారు.
లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తు గ్రామంలో బెల్టు షాపులను మూ యిస్తానన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మట్లాడుతూ ఆధార్, రేషన్ కార్డుల్లో వయస్సు తక్కువగా ఉండడం వల్ల కొందరు వృద్ధులు పింఛను కోల్పోయారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు. అంతకు ముందు పి.గన్నవరంలో తహశీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని కలెక్టర్ ప్రారంభిం చారు. జెడ్పీ సీఈఓ భగవాన్, ఆర్డీఓ జి.గణేష్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎన్‌ఆర్ మూర్తి, ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఎంపీడీఓ ఎం.ప్రభాకరరావు పాల్గొన్నారు.