మూగ జీవాన్ని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది.
మూగ జీవాన్ని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డుపైకి వచ్చిన జింకను బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన జింక ప్రాణాలు కోల్పోయింది. నెల క్రితం కూడా ఇలానే ఓ జింక వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే.. తరచూ వన్య ప్రాణులు ఘాట్ రోడ్ లో ప్రమాద బారిన పడుతున్నాయని.. దీనిపై అటవీ అధికారుల చర్యలు లేక పోవడం.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.