'స్వచ్ఛ హైదరాబాద్‌'లో మంత్రులు | Telangana ministers participate in Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ హైదరాబాద్‌'లో మంత్రులు

Jun 4 2015 3:23 PM | Updated on Sep 3 2017 3:13 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి పద్మారావులు సుడిగాలి పర్యటనలు చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి పద్మారావులు సుడిగాలి పర్యటనలు చేశారు. జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement