టీడీపీ ఎంపీటీసీ వీరంగం | TDP MPTC Attack On Woman In Anantapur | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీటీసీ వీరంగం

Aug 2 2018 9:41 AM | Updated on Aug 17 2018 7:40 PM

TDP MPTC Attack On Woman In Anantapur - Sakshi

టీడీపీ నాయకుడి దాడిలో ధ్వంసమైన నాగలక్ష్మమ్మ అంగడి

రామగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగు తమ్ముడు వీరంగం వేశాడు. మద్యం మత్తులో జోగుతూ ఆవేశంతో ఊగిపోతూ మహిళా వ్యాపారిపై దౌర్జన్యం చేశాడు. అడ్డుకోబోయిన వారిపైనా దాడి చేశాడు. వివరాల్లోకెళితే.. అనంతపురం రూరల్‌ మండలం కాట్నేకాలువ ఎంపీటీసీ సభ్యుడు నారాయణస్వామి బుధవారం రామగిరి మండలం పేరూరులో సీఎం సభకు వచ్చాడు. అక్కడ చిల్లరకొట్టు పెట్టుకున్న నాగలక్ష్మమ్మ వద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, సిగరెట్లు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వండని నాగలక్ష్మమ్మ అడిగితే.. ‘ఏయ్‌ నన్నే డబ్బులు అడుగుతావా.. నీ అ...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అంగట్లోని సరుకులను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగక ఈ దాష్టీకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడులకు దిగి భయానక వాతావరణం సృష్టించాడు. మహిళను నడిరోడ్డుపై కొడుతున్నా పోలీసులు సైతం ఆపలేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement