ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని | tdp mp kesineni nani comments on ap transport department | Sakshi
Sakshi News home page

ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని

Jun 12 2017 2:19 PM | Updated on Aug 10 2018 7:07 PM

ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని - Sakshi

ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని

ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఎంపీ కేశినేని నాని ఘాటుగా విమర్శించారు.

విజయవాడ: అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఎంపీ కేశినేని నాని ఘాటుగా విమర్శించారు. రవాణా శాఖ మొత్తం అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ రద్దయిన బస్సులను రాష్ట్రంలో ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
 
ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్‌ప్రదేశ్‌ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే.. రాష్ట్రంలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా జీవితంలో మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను బస్సుల వ్యాపారాన్ని విడిచిపెట్టానని స్పష్టం చేశారు. గతంలో తాను తిప్పిన బస్సుల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసినవి లేవన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణాశాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement