స్వాధార్‌ గృహం వాచ్‌మెన్‌ అరెస్టు: తానేటి వనిత

Taneti Vanitha: Swadhar House Watchmen Arrested - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి బొమ్మూరులోని స్వాధార్‌ గృహం వార్డెన్‌ అరుణ, వాచ్‌మెన్‌ రెడ్డిబాబును విధుల నుంచి తొలగించామని ఆంధ్రప్రదేశ్‌ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జిల్లాలోని బొమ్మూరులో స్వాధార్‌ గృహంలో వాచ్‌మెన్‌ నలుగురు యువతులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాచ్‌మెన్‌ వేధింపులు ఎక్కువవ్వడంతో తీవ్ర మనో వేదనకు గురైన బాధితులు రెడ్డిబాబు చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాధార్ గృహంలో యువతులపై వాచ్మెన్ అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌ స్పందించారు. ఘటన బాధిత యువతులను, మహిళలను ప్రభుత్వాస్పత్రిలో బుధవారం పరామర్శించారు. (ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని)

ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. మేనేజర్‌ రమణాశ్రీని సస్పెండ్‌ చేశామని, బాధితులైన నలుగురు అమ్మాయిలతో మరో నలుగురిని వేరే స్టేట్‌ హోంకు తరలిస్తామని తెలిపారు. స్వాధార్‌ గృహంలో సీసీ కెమెరాలను వాచ్‌మెన్‌, వార్డెన్‌ కలిసి నిలిపి వేశారని పేర్కొన్నారు. వాచ్‌మెన్‌ రెడ్డిబాబును అరెస్ట్‌ చేశామన్నారు. మహిళలందరూ ధైర్యంగా, భరోసాగా ఉండేందుకే దిశ చట్టాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top