వి.కోటలో స్వైన్‌ఫ్లూ కలకలం

Swine Flu Case Filed In Chittoor - Sakshi

చిత్తూరు  , వి.కోట: మండలంలోని బోడిగుట్లపల్లికి చెందిన చిన్నారికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్‌ కుమార్తె సాయిలక్ష్మి(6) పది రోజు లుగా తీవ్రమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతోంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగళూరులో చూపిం చారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలికకు హెచ్‌1 ఎన్‌1 స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారించారు.

ఈ విష యం తెలియడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓగు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మురళీకృష్ణనాయుడు ఆదివారం బోడిగుట్లపల్లిలో స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదిం చాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం స్వైన్‌ ఫ్లూ వ్యాధి సోకిన చిన్నారి సాయిలక్ష్మి కుటుంబ సభ్యులకు వివిధ పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిరోధక మందులు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top