వివాహిత అనుమానాస్పద మృతి | suspicious death of married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Aug 16 2015 11:40 AM | Updated on Sep 3 2017 7:33 AM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఎర్రగొండపాలెం (ప్రకాశం) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలో రెడీమేడ్ బట్టల షాపు నిర్వహిస్తున్న మస్తాన్ వలీ భార్య పెద పీరమ్మ(30) ఆదివారం ఉదయం హెయిర్ డై తాగి బలవన్మరణానికి యత్నించింది.

దీనిని గమనించిన మస్తాన్ వలీ భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో నర్సరావుపేటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలొదిలింది. కాగా మస్తాన్ వలీ పరారీలో ఉన్నాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement