విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా | student died in water stream at prakasam district | Sakshi
Sakshi News home page

విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

Dec 6 2015 2:58 PM | Updated on Nov 9 2018 4:36 PM

ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కల్యాణ్(15) అనే 9వ తరగతి విద్యార్ధి వల్లూరుపాడు వంకలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు.

ఆదివారం సెలవు దినం కావడంతో ఐదుగురు స్నేహితులు సరదాగా ఈత కొట్టడానికి వంకకు వెళ్లారు. వంకలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కల్యాణ్ దిగడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు గ్రామస్థులకు సమాచారమివ్వడంతో కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. అతనికి ఈత రాకపోవడం కూడా మృతికి కారణంగా తెలుస్తుంది. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement