
లాభసాటిగాసాగు.. ఉపాధి కల్పన
ys jagan mohan reddy, ap-budget-2015, ap assembly sessions, ysrcp, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ-అసెంబ్లీ-2015, ఏపీ అసెంబ్లీ సమావేశాలు, వైఎస్ఆర్సీపీ
♦ బడ్జెట్‌పై చర్చలో ఆర్థికమంత్రి యనమల జవాబు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా పలు ఉద్యోగావకాశాలు, వృద్ధిరేటు లక్ష్యాలుగా బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రణాళికేతర, రెవెన్యూ వ్యయాలు తగ్గించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత అన్నారు. బడ్జెట్‌పై గురువారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చకు మంత్రి సమాధానమిచ్చారు.
రాష్ట్రాన్ని కరువు లేకుండా తీర్చిదిద్ది వ్యవసాయ, అనుబంధ రంగాలను ప్రగతిబాటలో నడిపి వృద్ధి రేటు సాధిస్తామన్నారు.ఇప్పటికే 43 లక్షల కుటుంబాలకు రూ.5 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఈ బడ్జెట్‌లో మరో రూ.4,300 కోట్లు కేటాయించామన్నారు. మిగిలిన అర్హులనూ గుర్తించి 2015-16లో రైతు రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. యనమల ఇంకా ఏమన్నారంటే..
ఓడీకి వెళ్లే పరిస్థితి..
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేపో ఎల్లుండో ఓవర్ డ్రాఫ్టు (ఓడీ)కి వెళ్లేలా ఉంది. రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భూములు అమ్ముకుంటే రూ. 20 వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో పెట్టుకోవచ్చు. అయితే అది వాస్తవరూపం దాల్చదు. వాస్తవ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపొందించాం. దేశంలో మొదటిసారి రూ. 6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాం. కాపులకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు, బ్రాహ్మణులకు రూ. 35 కోట్లు కేటాయించాం.
అందుకే విజన్ 2029: తయారీ, ఐటీ రంగాల ద్వారా భారీగా ఉద్యోగాలు కల్పిం చేందుకు చంద్రబాబు ‘విజన్ 2029’ రూపొం దించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయి. నీటిపారుదల శాఖకు ప్రణాళికేతర పద్దుతగ్గించాం. ప్రణాళిక కింద రూ.5,000 కోట్లు ఇచ్చాం. ‘ఈ ఏడాదితో రైతు రుణమాఫీని పూర్తి చేస్తాం. కొన్నిటికి ఈ ఏడాది సర్దలేకపోయినా భవిష్యత్తులో సర్దుతాం. ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తాం. నిరుద్యోగ భృతి కి బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాం.
రాజధానిలో పీపీపీ పద్ధతిన అభివృద్ధి
రాజధాని భూ సమీకరణలో రైతులకివ్వాల్సిన వాటా పోగా మిగిలే భూములను ప్రభుత్వ-ప్రైవేటు (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేస్తామని యనమల ప్రకటించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో మండలిలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంఘం సిఫారసుల కన్నా, 13వ ఆర్థిక సంఘం సిఫారసులే బాగున్నాయన్నారు. యువత రాబోయే రోజుల్లో మరింత తగ్గిపోనున్నందున చంద్రబాబు ‘పిల్లల్ని కనండి’ అని అన్నారని యనమల పేర్కొన్నారు.
ప్రతిపక్షనేతపై విమర్శల పర్వం
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ది చంద్రబాబు విజన్ అయితే అధికారం వస్తే ఎలా దోచుకోవాలన్నదే విపక్ష నేత జగన్ విజన్ అని మంత్రి యనమల అసెంబ్లీలో విమర్శించా రు. ప్రతిపక్షనేత 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ‘రాష్ట్రానికి డబ్బు, పరిశ్రమలు రాకూడదన్నదే విపక్ష నేత లక్ష్యం. ఆయన ఇందుకోస మే కష్టపడుతున్నారు. 14వ ఆర్థిక సంఘానికి రూ. 14,000 కోట్ల లోటు చూపడాన్ని తప్పుబడుతున్నారు. ఈ లోటు చూపింది గవర్నర్ పాలనలో నే. గవర్నర్ ఇచ్చిన గణాంకాల ప్రకారమే రూ.16,000 కోట్లు లోటు చూపించాం. అంత లోటు ఎక్కడుం దని జగన్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవం గా బడ్జెట్ తయారుచేసింది ఆయనా? మేమా?’ అని యనమల అన్నారు.
ప్రతిపక్షానికి స్పీకర్ రక్షణగా ఉండాలి
ఈ మధ్య కాలంలో ఏ చట్టసభల్లోనైనా గలాభాలు జరగడానికి ఉంటున్న కారణాల్లో స్పీకర్ స్థానంలో ఉండేవారి వ్యవహర శైలి కూడా ఒకటి. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చున్నాక తమ పార్టీని పూర్తిగా మర్చిపోవాలి. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి చూస్తే... వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంది.
- సి. రామచంద్రయ్య, మండలిలో ప్రతిపక్ష నేత
విపక్షం లేకుండా సభకు గౌరవప్రదం కాదు
శాసనసభ నిర్వహణలో హుందాగా వ్యవహరించాల్సిన అధికార పక్షం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదు. విపక్షం లేకుండా అసెంబ్లీ జరగడం గౌరవప్ర దం కాదు. గురువారంనాటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీవీల్లో ప్రసారాలు నిలిపేసి విపక్ష స భ్యుల్ని బయటకు పంపాల్సిన అవసరం ఏముంది?
- కె.రామకృష్ణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి