మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌..!

special story on mobile phone - Sakshi

సామాజిక మాధ్యమాలపై పెరుగుతున్న మక్కువ

కుటుంబసభ్యుల మధ్య పెరుగుతున్న అంతరం

పక్కనే ఉన్నా మెసేజ్‌లతోనే పలకరింపులు

పిల్లల్లోనూ మారుతున్న పరిణామాలు  

తణుకు: సుదూర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులతో మాట్లాడాలంటే స్వయంగా రాసిన దస్తూరితో ఉత్తరాలు.. లేదా ఫోన్‌లో సుదీర్ఘ సంభాషణలు.. స్నేహితులతో తమ అనుభూతులు పంచుకోవా లంటే గుంపులు గుంపులుగా కూర్చుని చర్చలు.. కుటుంబసభ్యులంతా కూర్చుని ఒకచోట భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. మరి ఇప్పుడు.. ఎక్కడో ఉన్న బంధువులకు సైతం వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో మెసేజ్‌లు. స్నేహితుడు పక్కనే ఉన్నా హాయ్‌.. బాయ్‌.. అంటూ చాటింగ్‌లతో సంక్షిప్త సందేశాలు. ఇంట్లో ఒకేచోట డైనింగ్‌ హాల్‌లో కుటుంబ సభ్యులంతా భో జనం చేస్తున్నా చేతిలో సెల్‌ఫోన్‌తోపాటు ఎదురుగా టీవీలో మునిగి ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉండటం. సెల్‌ఫోన్లు, టీవీల్లాంటి మాధ్యమాలు కుటు ంబసభ్యుల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. తనివితీరా మాట్లాడుకునే సందర్భాలు అటు స్నేహితుల్లోనూ తగ్గిపోతున్నాయి. ఇవి మానవ సంబంధాల్లో కీలక మార్పులకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. 

అనుభూతులకు దూరం
మారుతున్న పరిస్థితులకు తోడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇప్పు డు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. తెల్లారితే చాలు వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మా ధ్యమాలతోనే రోజును ప్రారంభిస్తున్నా రు. ఖాళీ సమయం దొరికితే చాలు వా ట్సప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌డేట్స్‌ కోసం వెతకడం.. లేక చాట్‌ చేయడం, కొత్త యాప్స్‌ కోసం వెతకడం మీదే ధ్యాస పెడుతున్నా రు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే సెల్‌ఫో న్‌పై దృష్టిపెట్టడంతో చదువుపై గణ నీయంగా ధ్యాస తగ్గుతోందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. చాలా ఇళ్లల్లో భోజనం చేసేటప్పుడు టీవీ చూడటమో లేదా సెల్‌ఫోన్‌లో చాట్‌ చేయడ మో చేస్తున్నారు. ఇలాచేయడం వల్ల ఉబ కాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వై ద్యులు  చెబుతున్నారు. భోజనం మీదనే పూర్తిగా దృష్టిసారిస్తే మెదడు నుంచి కడుపునకు ‘ఇంక చాలు’ అనే సంజ్ఞలు వస్తాయని అయితే అలాకాకుండా దృష్టి వేరొక చోట ఉండటం వల్ల ఎక్కువగా తినడం, అజీర్తీ, బరువు పెరడగం తద్వారా ఒబెసిటీకు గురవుతామని చెబుతున్నారు. ఇలా ంటి సామాజిక మాధ్యమాల కారణంగా కొన్నిసార్లు అనుభూతులకు దూరమవుతున్నారని నిపుణులు అంటున్నారు. బ యట నుంచి ఇంటికి వచ్చినా సెల్‌ఫోన్‌పై నే ఎక్కువగా దృష్టి సారించడంతో సు మారు 70 శాతం కుటుంబాలు అనుభూతులకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. 

డిప్రెషన్‌ పెరుగుతుంది
చిన్నప్పటి నుంచి టీవీ, సెల్‌ఫోన్‌ ఇతరత్రా మాధ్యమాలపైనే ధ్యాస పెడుతున్నారు. కౌమార దశ వచ్చే సరికి అదే జీవి తంగా మారి ఇతర విషయాలపై దృష్టి సారించడంలేదు. ఈ సమయంలో ఒక్కోసారి మితిమీరి అనర్థాలకు దారితీస్తోంది. డిప్రెషన్‌కు లోనుకావడంతో వారిలో చిరా కు పెరుగుతుంది. చేయిదాటి పోయాక తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువస్తున్నారు. చిన్నప్పటి నుంచే స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచడం మేలు.
–అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్టు, తణుకు 

పిల్లల్లోనూ అదే పరిస్థితి
ఇంట్లో పెద్దవారు టీవీలు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోతుడంటంతో పిల్లలు సైతం వారినే అనుకరిస్తున్నారు. ఈ ప్రభావం పిల్లలపై పడుతుండటంతో వారు కూడా తమంతట తాముగా మాధ్యమాలవైపు ఆకర్షితులవుతున్నారు. ఒక్కోసారి పిల్లలు మారాం చేస్తే వారి చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి వీడియోలు చూపించడం, గేమ్స్‌ ఆడించడం వంటివి చేస్తున్నారు. చివరికి ఇదే అలవాటుగా మారుతోంది. దీంతో హైస్కూల్‌ స్థాయిలో సైతం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లు స్కూలుకు తీసుకువెళ్లడం పరిపాటిగా మారింది. చాలా మంది చదువుకున్న తల్లిదండ్రుల్లో యజమానికి కుటుంబంపై శ్రద్ధ సడలుతున్నట్టు అనిపిస్తోందని, పిల్లల అలవాట్లు వారిపై ప్రణాళిక లోపిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వంటి మాధ్యమాల కా రణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా వస్తున్నట్టు చెబుతున్నారు. పె ళ్లయిన మగవారిలో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడటం, చాటింగ్‌ వంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. మహిళలైతే టీవీ చూడటం, పుస్తకాలు చదవడం లాంటివి చేస్తున్నారు. పెళ్లికాని యువత మాత్రం చాటింగ్, ఫేస్‌బుక్, వాట్సప్, గేమ్స్‌ వంటివాటిపై ఎక్కువ సమయం వె చ్చిస్తున్నట్టు తేలింది. తమ జ్ఞాపకాలు, ఇతర విషయాలను ఈ మాధ్యమాల ద్వారానే స్నేహితులకు షేర్‌ చేసుకుని వాటికి స్పందన కోసం ఆరాటపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top