ఇంజన్లో తలెత్తిన సమస్యకారణంగా పోగలు రావడంతో శేషాద్రి ఎక్స్ ప్రెస్ని కుప్పంలో నిలిపేశారు.
చిత్తూరు: ఇంజన్లో తలెత్తిన సమస్యకారణంగా పొగలు రావడంతో శేషాద్రి ఎక్స్ ప్రెస్ని కుప్పంలో నిలిపేశారు. తొలుత కుప్పం మండలం ఆవులనత్తం వద్ద శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇంజన్లో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. అలాగే రైలును కుప్పం వరకు డ్రైవర్ తీసుకెళ్లాడు. ఆదే ఇంజన్తో ముందుకు వెళ్లడం ప్రమాదమని భావించిన అధికారులు మరో ఇంజన్ కోసం వేచి చూస్తున్నారు.