నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.