‘సాక్షి’ విలేకరి మృతి 

Sanjamala Mandalam Sakshi Reporter Deceased Of Heart Attack

కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా సంజామల మండలం ‘సాక్షి’ విలేకరి కుమ్మరి వెంకటేశ్వర్లు (45) గురువారం మృతి చెందారు. ఐదు రోజుల క్రితం పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిన వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు గత 20 ఏళ్లుగా వివిధ పత్రికల్లోనూ, ‘సాక్షి’ ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ పనిచేశారు. 2014 నుంచి ‘సాక్షి’ సంజామల మండల విలేకరిగా పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఏపీయూడబ్ల్యూజే బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగుతూ యూనియన్‌ తరఫున జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడ్డారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా మృతుని భార్య ఆరేళ్ల క్రితం మరణించింది. విలేకరి మృతి పట్ల వివిధ జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top