పారిశుధ్య సేవకు పాదాభివందనం

Sanitary Workers Felicitated By YSRCP MLAs in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నివాణకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది పాటు పారిశుధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని సముచితంగా సత్కరిస్తున్నారు. (ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు)

ఘన సన్మానం..
పారిశుధ్య కార్మికుల సేవలకు ఫిదా అయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారికి పాదపూజ చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం కార్మికుల కాళ్లు కడిగి, పూలతో అభిషేకం చేశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

నోట్ల దండం..
విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ప్రజాప్రయోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు పారిశుధ్య కార్మికులను స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నోట్లదండలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు పాల్గొన్నారు. పోలీసులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.

పూలవాన
విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జల నారాయణరావుతో కలిసి పారిశుధ్య కార్మికులపై పూలు చల్లి అభినందించారు. రేషన్‌ కార్డు లేని 150 కుటుంబాలకు పది కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top