'చంద్రబాబు ప్యాకేజీ నాయుడుగా మారారు' | Roja scoffs Chandrababu Naidu for pitching packages from Centre | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ప్యాకేజీ నాయుడుగా మారారు'

Nov 6 2013 2:52 PM | Updated on Sep 27 2018 5:59 PM

'చంద్రబాబు ప్యాకేజీ  నాయుడుగా మారారు' - Sakshi

'చంద్రబాబు ప్యాకేజీ నాయుడుగా మారారు'

రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ :  రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికీ స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. సోనియా కోసం ఇటలీ భాష నేర్చుకుని మాట్లాడిన బాబు.... సమైక్యమన్న తెలుగు పదం ఎందుకు మాట్లాడటం లేదని రోజా సూటీగా ప్రశ్నించారు.

చంద్రబాబు తీరు...గాయం చేయమని కత్తిచ్చి....న్యాయం చేయమన్నట్లుందని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్యాకేజీ నాయుడుగా మారారని ఆమె ఎద్దేవా చేశారు.  సీమాంధ్ర రాజధాని ఏర్పాటు కోసం ప్యాకేజీ కావాలని బాబు గతంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. విభజనలో కుమ్మక్కు అయిన చంద్రబాబు మళ్లీ ఎందుకోసం యాత్రలు చేపడుతున్నారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా కృషి చేయాలని బాబుకు ఆమె సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారులు దిగ్బంధానికి ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని రోజా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement