రిమ్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం.. రోగికి గడువు ముగిసిన సెలైన్‌ | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం

Published Thu, Jun 6 2019 12:11 PM

Rims Staff Negligence Treatment With  Expired Saline Bottles - Sakshi

ఒంగోలు సెంట్రల్‌: స్థానిక రిమ్స్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి గడువు ముగిసిన సెలైన్‌ను రోగికి ఎక్కించారు. రోగి తరుపు వారు ఈ విషయాన్ని గుర్తించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు దానిని మార్చివేశారు. ఈతముక్కలకు చెందిన జి. శ్రీను అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన కడుపునొప్పితో బాధపడుతూ రిమ్స్‌లో వైద్య చికిత్స నిమిత్తం చేరాడు. పరీక్షించిన వైద్యులు రోగిని చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేర్చారు. అయితే వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్‌ ఇంజెక్షన్‌ను రోగికి ఎక్కిస్తున్నారు. బుధవారం రోగి తరఫు వారు ఈ విషయాన్ని గమనించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. దీంతో వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్‌ను తీసిశారు. పక్క వారికి కూడా ఇదే ఇంజెక్షన్‌లను ఇస్తుండటంతో ఈ విషయాన్ని కూడా వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement