కన్న ప్రేమంటే ఇంత చీదరింపా?

Relatives Leave Elderly Man in Samarlakota Near Train Gate - Sakshi

ఉండూరు రోడ్డులో చెట్టు కింద వృద్ధుడిని విడిచిన బంధువులు

చలిగాలిలో అవస్థలు  

నోటి మాట రాని వృద్ధుడు గమనించిన వాకర్స్‌

తూర్పుగోదావరి,సామర్లకోట: ఆ వృద్ధుడు ఎవరికి భారమయ్యాడో కానీ అనాథగా ఓ చెట్టు కింద ఇలా కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం ఉండూరు రోడ్డులో రైల్వే గేటు సమీపంలోని ఓ చెట్టు కింద సుమారు 70 ఏళ్ల వృద్ధుడు పడి ఉన్నాడు. ఆ రోడ్డులో సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న వారు ఇది గమనించి మద్యం సేవించి పడిపోయి ఉంటాడని భావించారు. సాయంత్రం కూడా అతడు అలాగే చలిగాలికి వణికిపోతూ కనిపించడంతో వాకర్స్‌ చలించిపోయారు.

ఆ వృద్ధుడికి దుప్పటి ఇచ్చి తాగునీరు, ఆహారం అందించారు. ఈ వృద్ధుడిని మూడు రోజుల క్రితం మోటారు సైకిల్‌పై వచ్చిన వారు వదిలి వెళ్లి పోయారని సమీపంలో ఉన్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం వల్ల విడిచి వెళ్లారని భావించామని తెలిపారు. అయితే వృద్ధుడి నుంచి సమాచారం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట స్పష్టంగా రావడం లేదు. అయితే గ్రామం మాత్రం మాధవపట్నం అని చెప్పగలిగాడు. ఈ పెద్దాయనను  ఎవరో కర్కశులు ఈ విధంగా చలిలో వదిలి వెళ్లిపోవడంతో స్థానికుల హృదయాలు చలించిపోయాయి. పోలీసులు ఈ వృద్ధుడిని రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top