లారీలో తరలిస్తున్న 160 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం పట్టణానికి సమీపంలోని
160 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Dec 15 2013 3:56 AM | Updated on Aug 21 2018 7:53 PM
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :లారీలో తరలిస్తున్న 160 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం పట్టణానికి సమీపంలోని సూర్యాసెమ్ వద్ద పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతోందంటూ విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డికి విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు సీఐ వంశీధర్, డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో రామారావు సూర్యాసెమ్ వద్ద తనిఖీలు నిర్వహించారు.
దాచేపల్లి వైపు నుంచి గుంటూరు వైపు ఏపీ 7టిడి 3115 నంబరు గల లారీని సోదా చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీడ్రైవర్ అశోక్, యజమాని తోట మల్లయ్యలను విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాచేపల్లికి చెందిన వేముల శ్రీహరి, మందపాటి నరసింహారావు, ఒంటెల చంద్రశేఖర్ అలియాస్ చందు, నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన సురేష్, డ్రైవర్ అశోక్, యజమాని తోట మల్లయ్యలపై పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బియ్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ లారీపై జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement