ప్రేమజంటకు పోలీసుల కౌన్సెలింగ్ | police counselling to lovers | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు పోలీసుల కౌన్సెలింగ్

Aug 19 2013 5:06 AM | Updated on Aug 21 2018 5:44 PM

తాము ప్రేమించుకున్నామని, వివాహం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ఓ ప్రేమ జంటకు కామేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోవింద్రాలకు చెంది న లకావత్ గీత, రఘునాధపాలెం మండలం బూడిదెంపాడుకు చెందిన కేలోత్ రమేష్ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు

 కామేపల్లి, న్యూస్‌లైన్: తాము ప్రేమించుకున్నామని, వివాహం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ఓ ప్రేమ జంటకు కామేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోవింద్రాలకు చెంది న లకావత్ గీత, రఘునాధపాలెం మండలం బూడిదెంపాడుకు చెందిన కేలోత్ రమేష్ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో రమేష్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని గీత తండ్రి లాల్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ తనకు ఒకరోజు గడువు కావాలని రమేష్ అడుగడంతో వివాహం నిలిచిపోయింది. ఇద్దరు మేజర్లు కావడంతో తప్పని సరిగా వివాహం చేసుకోవాలని లేకుంటే కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement