
సాక్షి, అమరావతి: ‘ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించండి. కమ్ముకొస్తున్న చీకటిని రాష్ట్ర ప్రజలు ఆశాజ్యోతిని వెలిగించడం ద్వారా ఒక అనంతమైన ప్రకాశంతో పారద్రోలుదాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోవిడ్–19 మహమ్మారిపై మనమంతా ఐక్యంగా ఒక బలీయమైన చెక్కుచెదరని శక్తిగా నిలబడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి ట్వీట్ చేశారు.
థ్యాంక్యూ జగన్‌జీ : ప్రధాని
సీఎం జగన్ ట్వీట్‌కు బదులిచ్చిన మోదీ
‘జగన్‌గారూ.. ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. కరోనాపై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యత పెంపొందించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది’ అని ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.